కర్నూలులో తారాస్థాయికి బీజేపీ, వైసీపీ వార్‌

కర్నూలులో తారాస్థాయికి బీజేపీ, వైసీపీ వార్‌

కర్నూలులో వైసీపీ, బీజేపీ నేతల మధ్య వార్ తారస్థాయికి చేరుతోంది. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి హరీష్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేరుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మత ఘర్షణలు కలిగే విధంగా.. మాట్లాడుతున్నారని సీఎం, హోమ్ మంత్రి, డీజీపీ కి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేపై హఫీజ్ ఖాన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయమంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి హరీష్‌. మర్కజ్ కు వెళ్లొచ్చిన వారికి ఎమ్మెల్యే రహస్యంగా చికిత్స చేయించారని ఆరోపించారాయన.