మోడి సొంత రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా మరణాలు...

మోడి సొంత రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా మరణాలు...

మోడి సొంత రాష్ట్రం గుజరాత్ లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.  వారం రోజుల క్రితం గుజరాత్ లో కరోనా కేసులు లేవు.  గుజరాత్ తో పాటుగా మరికొన్ని రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ ప్రవేశించలేదు.  కానీ, వారం రోజుల్లోనే మొత్తం మారిపోయింది.   వారం రోజుల్లో 52 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటుగా నాలుగు మరణాలు సంభవించడం అక్కడి ప్రజలను భయపెడుతున్నది.  ఈ స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రధాని మోడీతో సహా అధికారులు ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.   దేశంలో కరోనా మరణాలు అత్యధికంగా గుజరాత్ లోనే నమోదు కావడం విశేషం.  

ఇక దేశంలో ఇప్పటి వరకు 987 కరోనా పోసితవే కేసులు నమోదయ్యాయి.  వెయ్యికి చేరువ కావడంతో భారత ప్రభుత్వంతో పాటుగా అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి.    మహారాష్ట్రలో అత్యధికంగా 183 కేసులు నమోదుకాగా, కేరళలో 174 కేసులు నమోదయ్యాయి.  కర్ణాటకలో 78, తెలంగాణలో 67, ఆంధ్రప్రదేశ్ లో 19 కేసులు నమోదు కావడం విశేషం.  ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నాయి.