హైదరాబాద్ లో సిఐ,ఎస్ ఐ, కానిస్టేబుల్ కి కరోనా..!

హైదరాబాద్ లో సిఐ,ఎస్ ఐ, కానిస్టేబుల్ కి కరోనా..!

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. పోలిస్ శాఖలో కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ సీఐ కి కరోనా పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఐ కి వారి నుండే కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. ఆ సిఐ కంటైనెమెంట్ జోన్లలో కూడా పని చేసినట్టు తెలుస్తోంది. సిఐ కి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు డిపార్ట్మెంట్ లోని 30 మందికి టెస్ట్ లు చేసారు. అంతేకాకుండా గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ కి , కానిస్టేబుల్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కరోనా వచ్చిన వారి కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించారు. పోలీస్ శాఖలో కేసులు పెరుగుతుండటంతో వారు లాంగ్ లీవ్ ల కోసం అప్లై చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.