ఆఫ్రికా ఖండానికి కరోనా భయం...చీకట్లో కలిసిపోతుందా?

ఆఫ్రికా ఖండానికి కరోనా భయం...చీకట్లో కలిసిపోతుందా?

ఆఫ్రికా అంటే చీకటి ఖండం.  మొదటి మనిషి పుట్టింది అక్కడే.  ఆ ఖండంలో ఎన్నో అద్బుతమైన రహస్యాలు ఉన్నప్పటకి  ఇంకా చీకట్లోనే ఉండిపోయింది.  ఇప్పుడు ఈ ఖండానికి కరోనా భయం పట్టుకుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యాధి సోకినా దాని వలన తీవ్రంగా ఇబ్బందులు పడేది, నష్టపోయేది కూడా ఆఫ్రికా ఖండమే.  దీనికి అనేక నిదర్శనాలు ఉన్నాయి.  కలరా, మశూచి, పోలియో, సార్స్, ఎబోలా, నింఫా వంటి ఎన్నో వైరస్ లు ఆఫ్రికా ఖండంపై దాడి చేశాయి.  ప్రపంచ దేశాలలో వీటికి సంబంధించిన వైరస్ లు దాడి చేసినా, అంతటి ప్రభావం చూపించలేదు.  

ఆఫ్రికా ఖండంలో నిత్యం ఏదో ఒక వైరస్ దాడి చేస్తూనే ఉంటుంది.  అత్యధిక పేద దేశాలు కలిగిన ఖండం కావడంతో వాటిపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టడం లేదు.  కరోనా వైరస్ అగ్రరాజ్యాలను కూడా భయపెడుతున్నది కాబట్టే కరోనా వైరస్ అంటే ప్రపంచం భయపడుతున్నది.  అమెరికా, యూరోప్ లను వనికిస్తున్న ఈ వైరస్ ఇప్పుడిప్పుడే ఆఫ్రికా ఖండంలోకి కూడా ఎంటర్ అవుతున్నది.  ఒకవేళ అక్కడ ఈ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే ఆ ఖండం పరిస్థితి ఏంటి అన్నది అర్ధం కావడం లేదు.  మరణాల సంఖ్యను అంచనా వేయడం చాలా కష్టం అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.