ప్రేమించాడని దళితుడితో మూత్రం తాగించారు..!

ప్రేమించాడని దళితుడితో మూత్రం తాగించారు..!

ప్రేమిస్తే నచ్చజెప్పడమో...కేసులు పెట్టడమో చేయాలి. కానీ మంచిర్యాల జిల్లా జన్నారం లో ఓ దళిత యువకుడు ప్రేమించాడని చెప్పి అతడిచే మూత్రం తాగించారు. దీనిపై ఎస్సి, ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. కేసును సుమోటో గా స్వీకరించి విచారణ జరపాలని అదికారులను ఆదేశించింది. జన్నారం మండలానికి చెందిన అన్వేష్ అనే మైనర్ యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయితో యువకుడు అడవిలోకి వెళ్లగా స్నేహితులతో విషయం తెలుసుకున్న యువతీ బంధువులు కర్రలతో దాడిచేసి మూత్రం తాగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.