ఊపేసిన దేవదాస్ 'గణపతి' సాంగ్..!!

ఊపేసిన దేవదాస్ 'గణపతి' సాంగ్..!!

వినాయక చవితిని పురస్కరించుకొని దేవదాస్ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ లకలక లకుమీకర సాంగ్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు.  లకలకలకుమీకర అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ట్యూన్ రెగ్యులర్ బీట్ లా ఉన్నప్పటికీ లిరిక్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  చిన్న చిన్న పదాలతో మంచి ప్రయోగం చేశారు రామజోగయ్య శాస్త్రి.  రకరక రూపాలు నీవేనురా అంటూ పాటను సాగించిన విధానం బాగుంది.  

దేవదాస్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు సింగిల్స్ ను యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.  కాగా, ఇది మూడో సింగిల్.  అక్కినేని నాగార్జున, నానిలు ముల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్నది.