తన కంటే అందంగా ఉందని, గుండు కొట్టించి చంపేసింది !

తన కంటే అందంగా ఉందని, గుండు కొట్టించి చంపేసింది !

విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు మిస్టరీ వీడింది. అందమే దివ్య పాలిట శాపమై ఆమెను బలితీసుకుంది. రెండు రోజుల క్రితం అక్కయ్యపాలెం చెక్కులరాయి దగ్గర దివ్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. వసంత అనే మహిళ, ఆమె సోదరి కలిసి దివ్యతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే డబ్బుల పంపకం విషయంలో దివ్యకు, వసంతకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వసంత గ్యాంగ్‌ దివ్యను అత్యంత దారుణంగా హింసించి హత్య చేసింది.

తనకంటే అందంగా ఉందనే అసూయతో దివ్యకు గుండు గీయించి, కనుబొమ్మలు గీకేసి చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల్లో పోలీసులు ఈ హత్య కేసును చేధించారు. వసంతను, ఆమె సోదరిని అదుపులోకి తీసుకొన్నారు. హత్యకు సహకరించిన మిగిలిన వారి కోసం గాలింపు నిర్వహిస్తున్నారు. దివ్య స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. తల్లిత్రండులు లేకపోవటంతో పిన్నివాళ్లింట్లో పెరిగింది.

ఎనిమిది నెలల క్రితం విశాఖపట్నంలోని వసంత ఇంటికి వచ్చిన దివ్యతో వసంత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయించినట్లు తెలిసింది. వసంత భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. ఇక అక్కయ్యపాలెం చెక్కులరాయి దగ్గర దివ్య మరణించిన ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. పోలీసులు స్థానికుల దగ్గర సమాచారం రాబడుతున్నారు. ఈస్ట్‌ ఏసీపీ శేఖర్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలు ఏర్పాటు చేశామన్నారు డీసీపీ రంగారెడ్డి. రావులపాలెం నుంచి దివ్య కుటుంబ సభ్యులను రప్పించామని తెలిపారు.దివ్య శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు డీసీపీ రంగారెడ్డి. పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామన్నారు.