చరిత్రను తిరగరాసింది..!!

చరిత్రను తిరగరాసింది..!!

హాలీవుడ్ తరువాత రెండో అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశం చైనా.  ఇటీవలే చైనాలో క్యాన్సర్ ఔషధం నేపథ్యంలో సాగే డైయింగ్ టు సర్వైవ్ అనే చైనీస్ సినిమా రిలీజయింది.  రిలీజైన మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా 200 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.  

ఈ సినిమా కథ సింపుల్ గా ఉంటుంది.  క్యాన్సర్,  క్యాన్సర్ మందుల చుట్టూనే సినిమా నడుస్తుంది.  2002 వ సంవత్సరంలో యాంగ్ అనే వ్యాపారవేత్త క్యాన్సర్ బారిన పడతాడు.  ఈ వ్యాధి నయంకావాలంటే .. నోవార్టిస్ కంపెనీకి చెందిన గ్లివెన్ ఔషధాన్ని వాడాలి.  దీని ధర ఆకాశంలో ఉంటుంది.  ఒక్కో బాటిల్ ధర రూ.2.5 లక్షలు ఉంటుంది.  యాంగ్ ధనవంతుడు కావడంతో.. ఎలాగోలా వాడుతుంటాడు.  అదే సమయంలో ఇండియాలో వీనత్ అనే వ్యక్తి క్యాన్సర్ కు ఓ మందును కనుకొంటాడు.  అది గ్లివెన్ వలే సమర్ధవంతంగా పనిచేస్తుంది.  ధర కూడా చాలా తక్కువ కావడంతో, యాంగ్ క్యాన్సర్ కోసం ఆ మందును ఉపయోగిస్తాడు.  క్యాన్సర్ మందును ధనికులు ఎంత ఖర్చు పెట్టైనా కొనుగోలు చేస్తారు.  మరి పేదవాళ్ల పరిస్థితి ఏంటి.  క్యాన్సర్ వస్తే చనిపోవడం తప్ప వేరే మార్గం ఏమీలేదా... అని ఆలోచించిన యాంగ్ ఇండియా నుంచి ఆ క్యాన్సర్ మందును అక్రమ మార్గం ద్వారా చైనాకు తరలిస్తుంటాడు.  ఇదే సమయంలో చైనా అధికారులు యాంగ్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.  యాంగ్ చేసిన మంచిని  గుర్తించిన కోర్టు.. అతనిని నిర్దోషిగా విడుదల చేస్తుంది.  క్లుప్తంగా ఇది కథ.  

మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా 200 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే.. మరి లాంగ్ రన్ లో ఇంకెంత వసూళ్లు చేస్తుందో..  ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.