ఈనెల 20కి.. విధుల్లోకి విద్యా వాలంటీర్లు..

ఈనెల 20కి.. విధుల్లోకి విద్యా వాలంటీర్లు..

ఈనెల 20వ తేదీలోపు తెలంగాణలో విద్యా వాలంటీర్లను తీసుకోవాలని మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. అందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రాసెస్ ను ప్రారంభించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని... 17వ తేదీన ఎంఈఓలో వెరిఫికేషన్ చేసి ఆ జాబితాను డీఈఓలకు పంపాలని ఆయన కోరారు. ఆ తర్వాత కలెక్టర్ అధ్యక్షతన కమిటీ దరఖాస్తులను పరిశీలించి సెలెక్ట్ అయిన వారి జాబితాను ఎంఈవోలకు పంపించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 20 నుంచి విద్యా వాలంటీర్లు విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.16వేల 781మంది విద్యా వాలంటీర్లను తీసుకునేందుకు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీచర్ల బదిలీ ప్రక్రియతో నియామక ప్రక్రియ కాస్తా ఆగిపోయింది. విద్యా వాలంటీర్ల గౌరవ వేతనం 12000లుగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.