ఉత్తమ్ పై హైకమాండ్ కు సర్వే ఫిర్యాదు

ఉత్తమ్ పై హైకమాండ్ కు సర్వే ఫిర్యాదు

తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి పై మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. పార్టీకి శనిలా దాపురించి, నిండా ముంచాడని మండిపడ్డారు. ఢిల్లీలో ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనీని కలిసి సస్పెన్షన్ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తనని సస్పెండ్ చేయడం ఏంటని ఆంటోని ఆశ్చర్యపోయారని సర్వే వివరించారు. ఏఐసీసీ సభ్యుడునైనా తనపై క్రమశిక్షణా చర్య తీసుకునే అధికారం లేకపోయినా, పిసిసి అధ్యక్షుడు సస్పెండ్ చేశారని అంటోనికి వివరించినట్లు సర్వే సత్యనారాయణ చెప్పుకొచ్చారు. పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ కుంతియా చేసిన తప్పిదాలను అంటోనికి వివరించానని ఆయన చెప్పారు. ఉత్తంకుమార్ రెడ్డి చర్యలవల్ల చంద్రబాబు, ప్రొఫెసర్ కోదండరాం, కమ్యూనిస్టు పార్టీలు అంతా అభాసు పాలయ్యారన్నారు. కావాలనే పార్టీకి నష్టం చేసిన పీసీసీ అధ్యక్షుడు పైనే చర్య తీసుకోవాలని కోరినట్లు సర్వే తెలిపారు. తన ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోనీ ఆదేశించినట్లు చెప్పారు.