నెట్ న్యూట్రాలిటికి కేంద్రం అమోదం

నెట్ న్యూట్రాలిటికి కేంద్రం అమోదం

దేశంలో కార్పోరేట్ సంస్థలు ఇంటర్నెట్ ను తమ గుప్పెట్లో పెట్టుకుందుకు చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం తిప్పికొట్టింది. ఇంటర్నెట్ సేవలు అపరిమితంగా, అంతరాయం లేకుండా ఉండాలని తేల్చి చెప్పింది. దేశంలో నెట్ న్యూట్రాలిటిపై ప్రభుత్వం కొన్ని సూచనలను చేసింది. వీటిని ఉల్లంగించిన మొబైల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రోవైడర్స్, సోషల్ మీడియా కంపెనీలపై జరిమానాలు విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. ఇంటర్ మినిస్టీరియల్ టెలికం కమీషన్ ఈరోజు భేటి అయి, పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తక్షణమే నిర్ణయాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. నెట్ న్యూట్రాలిటికి అమోదం తెలుపుతూ, దేశంలో ఇంటర్నెట్ సేవలు అందరికి ఒకేలా ఉండాలని, ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలకు స్వస్తి పలకాలని హెచ్చరించింది. దీంతో దేశంలో ఇంటర్నెట్ సేవలు ప్రతి ఒక్కరి చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.