హరేంద్ర సింగ్‌పై వేటు...

హరేంద్ర సింగ్‌పై వేటు...

భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌పై వేటు పడింది. కోచ్ పదవి నుంచి హరేంద్ర సింగ్‌ను తప్పించారు. అయితే హరేంద్ర సింగ్‌కు జూనియర్‌ హాకీ జట్టు బాధ్యతలు అప్పగించారు. తాజాగా జరిగిన ప్రపంచ కప్‌లో భారత జట్టు గ్రూప్‌ దశలో టాపర్‌గా నిలిచినా.. సెమీఫైనల్‌కు చేరలేదు. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో హరేంద్రను కోచ్ పదవి నుంచి తప్పించారు. హరేంద్ర స్థానంలో కొత్త కోచ్‌ ఎంపిక కోసం హాకీ ఇండియా దరఖాస్తులు కోరింది. 2018 మే నుంచి హరేంద్ర భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. గత ఆరు సంవత్సరాలలో హాకీ సమాఖ్య తప్పించిన 6వ కోచ్‌ హరేంద్ర. మ్యాచ్‌ పరాజయం అనంతరం మేం 13 మందితో తలపడ్డామని రిఫరీలకు వ్యతిరేకంగా హరేంద్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తప్పించడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు.