కరోనా కేసుల్లో భారత్‌ సరికొత్త రికార్డు..

కరోనా కేసుల్లో భారత్‌ సరికొత్త రికార్డు..

భారత్‌పై కరోనా విరుచుకుపడుతోంది.. రోజుకో సరికొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భారత్‌ మరో కొత్త రికార్డు సృష్టించినట్టు అయ్యింది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,654 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 137 మంది కరోనా బారినపడి మృతిచెందారు. దీంతో.. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101 కు చేరింది. ప్రస్తుతం 69,597 యాక్టివ్ కేసులు ఉండగా.. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. మిగతా వారు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 3,720కు పెరిగింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం.. లాక్‌డౌన్‌ సడలింపులతో అంతా రోడ్లపైకి వచ్చేస్తుండగా.. కరోనా కొత్త కేసులు టెన్షన్ పెడుతున్నాయి.  మొత్తం నమోదు అయిన కేసుల్లో క్యూర్ అయిన కేసులు 41.3 శాతం ఉండగా... మరణాల శాతం 2.97గా ఉంది.. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 55.6 శాతంగా ఉన్నాయి.. గత 24 గంటల్లో నమోదు అయిన కేసులు 6,654 అయితే... క్యూర్ అయినవారి సంఖ్య 3,250గా ఉంది.