హైదరాబాద్‌లో గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ సదస్సు

హైదరాబాద్‌లో గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ సదస్సు

పలు అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారిపోయిన హైదరాబాద్ నగరం... మరో అంతర్జాతీయ సదస్సుకు అతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్‌లో గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ సదస్సు జరగనుందని తెలిపారు తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి వనరులు తగ్గిపోతున్న క్రమంలో నీటిని సంరక్షించుకోవడమే మన విధి అని తెలిపిన చందూలాల్‌... నీటిని వృధా చేయోద్దని సూచించారు. నీటి వనరులను సంరక్షణ కోసం ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడనుందన్నారు.