వరల్డ్‌కప్‌కి బయలుదేరిన కోహ్లీసేన

వరల్డ్‌కప్‌కి బయలుదేరిన కోహ్లీసేన

ప్రపంచకప్‌కి టీమిండియా రెడీ అయ్యింది. ఈనెల 30న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లండ్‌కు బయలుదేరింది. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇవాళ తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్టులో ఇంగ్లండ్‌ ఫ్లైటెక్కింది. ఆటాగాళ్లతోపాటు సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా అఫీషియల్‌ బ్లేజర్లు ధరించారు. ప్రపంచ్‌కప్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో  రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.