పవన్ కల్యాణ్ కంటికి మరోసారి శస్త్ర చికిత్స

పవన్ కల్యాణ్ కంటికి మరోసారి శస్త్ర చికిత్స

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు గురువారం మ‌రోసారి శస్త్ర చికిత్స జ‌రిగింది. హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని ‘సెంట‌ర్ ఫ‌ర్ సైట్’ కంటి ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ కంటికి శస్త్ర చికిత్స నిర్వహించారు. పవన్ కల్యాణ్ కు నేత్ర చికిత్స వైద్యులు డాక్ట‌ర్ సంతోష్ జి.హోనావ‌ర్ ఆప‌రేష‌న్ చేశారు. గ‌త‌ నాలుగు నెలలుగా కంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న పవన్ కల్యాణ్ కు నెల రోజుల కింద‌ట ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. పార్టీ కోసం త‌గినంత విశ్రాంతి తీసుకోక‌పోవ‌డంతో మళ్లీ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో పవన్ కు మ‌రోసారి ఆప‌రేష‌న్ నిర్వహించారు. ఈ నెల ఆఖరు వరకు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు.