ఆ రెండు పార్టీలు బీజేపీకి బినామీలు.. 

ఆ రెండు పార్టీలు బీజేపీకి బినామీలు.. 

వైసీపీ అధినేత జగన్ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని.. వైసీపీ, జనసేన పార్టీలు రెండూ బీజేపీకి బినామీలని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్. ఈరోజు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో జనసేన, వైసీపీలు రెండు బీజేపీకి బినామీలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నాలుగు సంవత్సరాలలో 56  శాతం పూర్తి చేశామని.. 2019కి పోలవరం కుడి, ఎడమ కాలువలకు  నీరు అందిస్తామని ఆయన వెల్లడించారు. 2014లో కేంద్ర సహకారం ఉంటుందని బీజేపీతో పోత్తుపెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. కానీ... బీజేపీ విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని... 75శాతం ప్రజలు చంద్రబాబు పాలనపై సంతృప్తిగా ఉన్నారని ఆయన వివరించారు.