కరోనా ఎఫెక్ట్ : ఫుడ్ డెలివరీ బాయ్‌లా మారిన ఒలింపిక్ విజేత

కరోనా ఎఫెక్ట్ : ఫుడ్ డెలివరీ బాయ్‌లా మారిన ఒలింపిక్ విజేత


కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. దీంతో ప్రజలు ఆర్థిక వెసులుబాటు కోసం అనేక మార్గాలను వెతుకుతున్నారు. మన దేశంలో డిగ్రీ ఉత్తీర్ణులు ఉపాధి హామీ పనికి వెళ్లడం ఇందుకు నిదర్శనం. అలాగే ఎందరో పెద్ద చదువులు చదివినవాళ్లు ఏ పని దొరికితే ఆ పని చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా జపాన్ కు చెందిన ఫెన్సర్‌ రియో మియాక్‌ అనే ఒలింపిక్ పతాక విజేత డెలివరీ బాయ్ గా మారాడు. రియో గతంలో ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించాడు.

ఇప్పుడు కరోనా వల్ల ఉబర్‌ ఈట్స్ లో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ గా మారి రోజుకి రెండువేల యెన్‌లు సంపాదిస్తున్నాడు. ఆర్థికంగా నిలబడటంతో పాటు రాబోయే పోటీల్లో పాల్గొనడానికి రోజు వారి ఖర్చుల కోసం ఈ పని చేస్తున్నాడు. రియో మియాక్‌ 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో టీమ్‌ విభాగంలో రజత పతకం గెలిచాడు. ఈ ఏడాది టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ లో రియో పాల్గొనాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీ రద్దయింది. దీంతో ఖాళీ సమయం దొరకడంతో రియో సంపాదనపై దృష్టిపెట్టాడు.