విజయ్ దేవరకొండతో స్టార్ హీరోయిన్ 

విజయ్ దేవరకొండతో స్టార్ హీరోయిన్ 

యువ హీరో విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ, ప్రస్తుతానికి రెండు సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేశాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రంతో మంచి విజయం సాధించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయనున్నాడని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకునే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. 

వరుసగా సినిమాలు చేస్తున్నా క్రాంతి మాధవ్ చెప్పిన స్టోరీ ఆసక్తికరంగా ఉండటంతో విజయ్ దేవరకొండ ఒకే చేశారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా విజయ్ గత చిత్రాలకు, శైలికి విభిన్నంగా ఉంటుందట. త్వరలోనే ఈ కొత్త సినిమాను అధికారికంగా లాంచ్ చేసి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 10 నుండి యూరప్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి ప్లాన్ చేశారట. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కే ఎస్ రామారావు నిర్మించనున్నారు.