ఎఫ్‌బీలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్.. చాటింగ్‌తో వల... చీటింగ్‌తో ఎండ్..

ఎఫ్‌బీలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్.. చాటింగ్‌తో వల... చీటింగ్‌తో ఎండ్..

సోషల్ మీడియాతో ఎంత మేలు చేస్తుందో.. కొన్ని సార్లు అంతకు మించి కీడు కూడా చేస్తోంది.. సోషల్ మీడియాలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్ పెట్టి.. ఆ తర్వాత మాటలు కలిపి.. ఆ తర్వాత చీటింగ్ చేసిన ఎన్నో కథలను చూస్తూనే ఉన్నాం.. తాజాగా, మరో హైదరాబాద్‌ యువకుడు కూడా ఫేస్‌బుక్ పరిచయానికి ఉప్పొంగి.. అడ్డంగా బుక్కయ్యారు.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది ఓ సైబర్ లేడీ.. తాను విదేశాల్లో ఉంటానని పరిచయం చేసుకుని మాటలు కలిపింది.. ఫేస్‌బుక్ మెసేజ్‌లు కాస్తా.. వాట్సాప్ చాటింగ్ వరకు వెళ్లాయి.. పూర్తిగా ఆ మాయలేడి మైకంలో మునిగిపోయాడు మలక్‌పేట్‌కు చెందిన సయ్యద్ అహ్మద్.. త్వరలోనే తాను ఇండియాకు వస్తున్నానని మెసేజ్ పెట్టిన మాయలేడి... వారం రోజుల క్రితం తాను ఇండియాకు వచ్చేశానని.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తనను, తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్‌ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని ఫోన్ చేసింది.. అంతేకాదు.. ప్లాన్‌లో భాగంగా తనను విడిపించాలని ప్రాధేయపడింది మాయలేడి.. తన వద్ద ఉన్న కరెన్సీకి కస్టమ్ ఛార్జ్, ఆదాయపన్ను పేరుతో డబ్బులు కావాలని వేడుకుంది.. అదితెలియన సయ్యద్.. ఏకంగా రూ. లక్షా 26 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు.. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గమనించి చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.