లాక్ డౌన్ ఎఫెక్ట్: చికెన్ దుకాణాల వద్ద భారీ క్యూ...

లాక్ డౌన్ ఎఫెక్ట్:  చికెన్ దుకాణాల వద్ద భారీ క్యూ...

లాక్ డౌన్ ఎఫెక్ట్ తెలంగాణలో భారీగా ఉన్నది.  మార్చి 24 వ తేదీ నుంచి దేశం వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణలో అన్నింటినీ మూసేశారు.  నిత్యవసర వస్తువులకు సంబంధించివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  దేశవ్యాప్తంగా సంపూర్ణంగా లాక్ డౌన్ చేయడంతో ప్రజలు దాదాపుగా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు.  ఆదివారం వస్తే నాన్ వెజ్ లేకుండా ఉండలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు.  అటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపించిన నేపధ్యంలో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయింది. చికెన్ తినేవాళ్ళు లేకపోవడంతో  నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులు.  

ఇదిలా ఉంటే, లాక్ డౌన్ తరువాత చికెన్ ధరలకు రెక్కలకు వచ్చినట్టుగా తెలుస్తోంది.  ఉదయం నుంచి చికెన్ దుకాణాల ముందు ప్రజలు క్యూలు కట్టారు.  చికెన్ తినడం వలన శరీరంలో శక్తి  పెరుగుతుందని, కరోనాను ఎదుర్కొనడానికి కావాల్సిన అన్నీ రకాల పోషకాలు ఇందులో ఉన్నాయని కొన్ని రోజుల క్రితం కేసీఆర్ చెప్పడంతో ప్రజలు చికెన్ పై దృష్టి పెట్టారని చెప్పవచ్చు.