కరోనా కారణంగా నష్టపోతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఎలా అంటే..?

కరోనా కారణంగా నష్టపోతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఎలా అంటే..?

ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న పేరు కరోనా. అయితే ఈ వైరస్ మహమ్మారి వల్ల వచ్చే నష్టాన్ని ఎదుర్కోవటానికి ఇంగ్లాండ్ క్రికెట్ పాలక మండలి (ఇసిబి) ప్రయత్నిస్తుంది. కరోనా కారణంగా అని మ్యాచ్లు నిలిచిపోవడం వలన వారు ఈ నష్టానికి గురవుతున్నారు. అయితే ఈ నెల ప్రారంభంలో ఇంగ్లాండ్ శ్రీలంక పర్యటన రద్దు చేయబడింది. అలాగే మే చివరి వరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడటం లేదని ఇసిబి ప్రకటించింది. అయితే వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో మరియు పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ ఈ జూన్ నుండి ఆగస్టు వరకు  ఆడాల్సిన అని సిరీస్లు కూడా ఇప్పటి పరిస్థితి మెరుగుపడకపోతే వాయిదా లేదా రద్దు చేసే ప్రమాదం ఉంది అందువల్ల ఆటగాళ్లను మరింత ఆదాయ నష్టానికి దారితీస్తుంది. అయితే ఇంగ్లీష్ ప్లేయర్స్ గత ఏడాది సెప్టెంబర్‌లో 10 టెస్ట్ కాంట్రాక్టులు మరియు 12 వైట్-బాల్ మ్యాచ్లకు కాంట్రాక్టులను ఇచ్చారు. క్రికెట్ మూడు ఫార్మాట్లలో ఇంగ్లాండ్ తరఫున ఆడే జో రూట్, బెన్ స్టోక్స్ మరియు జోస్ బట్లర్ వంటి ఆటగాళ్ళు అని మ్యాచ్లు నిలిచిపోయే ఈ మూడు నెలల సమయంలో సుమారు 200,000 పౌండ్ల (9,249,040) వేతనాన్ని నష్టపోనున్నారని అంచనా. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో.