గౌతమ్ మహేష్ ను మించిపోయేలా ఉన్నాడే...

గౌతమ్ మహేష్ ను మించిపోయేలా ఉన్నాడే...

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన సినీ నటులు అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. చేయాలనుకుని చేయలేనివి, ఇష్టమైనవి.. ఇలా చాలా పనులు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటానని గతంలో పలుమార్లు చెప్పడం జరిగింది. ఇక తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు మహేష్. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించడంతో షూటింగ్స్ అన్నీ బంద్ అయిన కారణంగా, కొద్దిరోజులుగా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి గడుపుతున్నాడు.ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ తో సూపర్ హిట్ కొట్టిన మహేష్ తాజా  తన కుమారుడు గౌతమ్ హైట్ చెక్ చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…గౌతమ్ ను చూస్తుంటే మహేష్ ను మించి హైట్ ఎదిగేలా ఉన్నాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.