తప్పకుండా ఆ పని చేయాలంటూ అభిమానులకు మహేష్ సూచనలు...

తప్పకుండా ఆ పని చేయాలంటూ అభిమానులకు మహేష్ సూచనలు...

కరోనా వైరస్ కు ఆ దేశం ఈ దేశం అనే తేడాలేకుండా ప్రతి దేశాన్ని ఈ వైరస్ అతలాకుతలం చేస్తున్నది. అయితే ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి నాలుగోసారి లాక్ డౌన్ ను పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రజల అవసరాల కోసం నెమ్మదిగా లాక్ డౌన్ లో సడలింపులు కలిగిస్తూ ప్రజలు రోడ్ల పైకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం  లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన ప్రజలు తప్పకుండ కొన్ని పనులు చేయాలనీ సూపర్ స్టార్ మహేష్ బాబు  తెలిపారు. ఈ రోజు ఆయన తన అధికారిక ట్విట్టర్లో మాస్క్ ధరించిన ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కొన్ని సూచలను ఇచ్చారు. అదేంటంటే... "మనం బయటకు వస్తున్నాము. నెమ్మదిగా, కానీ ఖచ్చితంగా వస్తాము. ఇలాంటి సమయంలో మాస్క్ లు తప్పనిసరి. మీరు బయటకు బయలుదేరిన ప్రతిసారీ మాస్క్ ధరించడం ఒక అలవాటుగా చేసుకోండి, అది కనీసం మనలను మరియు ఇతరులను రక్షించడానికి చేయగలిగిన పని" అని మహేష్ బాబు తెలిపారు. అయితే సూపర్ స్టార్ తన తరువాతి సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు. ఈ  నెల 31 న తన తండ్రి కృష్ణ గారి పుట్టిన రోజు సందర్బంగా తెలుపుతారు అని అభిమానులు ఎదురు చుస్తునారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.