పెళ్ళికి నిరాకరించిందని.. చితకబాదిన ప్రేమికుడు

పెళ్ళికి నిరాకరించిందని.. చితకబాదిన ప్రేమికుడు

పెళ్ళికి ఒప్పుకోవడం లేదంటూ ఓ యువతిని చితకబాదాడు శాడిస్ట్ ప్రేమికుడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పెళ్లి విషమై మాట్లాడుదామని సదరు సైకో ప్రేమికుడు యువతిని ఓ బేకరీకి రమ్మన్నాడు. అక్కడ ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పెళ్ళికి ఒప్పుకోవడం లేదంటూ యువతిని బేకరీలోనే   చితకబాదాడు. పిడి గుద్దులు గుద్దుతూ మృగంలా ప్రవర్తించాడు. అమ్మాయి కన్నీరు పెట్టుకున్నా వదలలేదు. తమ కళ్ళ ముందే యువతిని దారుణంగా కొడుతున్నా బేకరీలోని వారు కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైకో ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు.