అక్కతో అక్రమ సంబంధం ! కొట్టి చంపేసిన బావ 

అక్కతో అక్రమ సంబంధం ! కొట్టి చంపేసిన బావ 

ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగిన ఒక మర్డర్ కేసును సాల్వ్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వేలుగులోకి వచ్చాయి. అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో బావమరిదిని బావే(ఆమె భర్త) కొట్టి చంపినట్లు తేల్చారు పోలీసులు. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన పోకూరి రామస్వామి అక్కను దామా సుబ్బారావు వివాహం చేసుకున్నాడు. అయితే రామస్వామి గతేడాదిఇల్లు కట్టుకునేందుకు భూమి పూజ చేశాడు. ఆ కార్యక్రమానికి బంధువులు ఎక్కువ మంది రావడంతో తన ఇంట్లో చోటు లేక తన అక్క ఇంటికి వెళ్లి అక్క పక్కనే రామస్వామి పడుకున్నాడు. అయితే అది చూసిన సుబ్బారావు తన భార్య అంటే రామస్వామి అక్కతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించాడు. అదే విషయంగా పగ పెంచుకున్నాడు.

అప్పటి నుండి ఎప్పుడు కుదురుతుందా ? చంపెద్దామని చూస్తున్న అతను ఈ నెల 12న రాత్రి గొర్రెల దొడ్డి వద్ద కాపలాగా పడుకుని ఉన్న రామస్వామిని దారుణంగా కొట్టి చంపేశాడు. రోకలిబండతో ముఖంపై బలమైన గాయాలు కావడంతో రామస్వామి అక్కడికక్కడే చనిపోయాడు. రామస్వామి హత్యతో ప్రశాంతంగా ఉన్న పల్లె ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అప్పటి నుంచి పరారీలో సుబ్బారావు ఉండడంతో అతని మీదనే అనుమానాలు ఉన్నా, ఈ వివాహేతర సంబంధం కోణం మాత్రం అతను లోంగిపోయాక వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిజంగా వారిద్దరికీ ఏమైనా సంబందం ఉందా ? లేక ఇదంతా అతని అనుమానమేనా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది/