లవర్ కోసం దొంగగా మారి..సొంత సంస్థ నుంచే 8 లక్షల దోపిడీ

లవర్ కోసం దొంగగా మారి..సొంత సంస్థ నుంచే 8 లక్షల దోపిడీ

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించి, 8 లక్షల 51 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 
సోమవారం సాయంత్రం కలెక్షన్ బాయ్ అచ్చిరెడ్డి నుండి ఎనిమిది లక్షల రూపాయల నగదు బ్యాగ్ ఎత్తుకెళ్లారంటూ ఫిర్యాదు చేశారు. అయితే దోపిడీ కోణం లో దర్యాప్తు చేసిన పోలీసులకి విచారణ లో కలెక్షన్ బాయ్ అచ్చిరెడ్డి నిందితుడు అని తేలింది. అచ్చిరెడ్డి దోపిడీ పేరుతో డ్రామా ఆడాడని పోలీసులు తేల్చారు. నిందితుడు mba చదివి పేపర్ మిల్లులో అకౌంటెంట్ గా చేరాడు. అయితే అచ్చిరెడ్డి ప్రియురాలికి ఆరోగ్యం బాగాలేదు. ఆ అమ్మాయి కోసమే ఈ దోపిడీ డ్రామా ఆడినట్లు దర్యాప్తులో తేల్చారు పోలీసులు.  

అచ్చిరెడ్డి బ్యాగ్ ను దాచిపెట్టి ... దారి దోపిడీ చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో గుర్తించిన అధికారులు.  పేపర్ ప్లేట్స్ తయారు చేసే ముడి సరుకును సరఫరా చేసే కంపెనీలో కలెక్షన్ బాయ్ గా చేరిన అచ్చి రెడ్డి, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కలెక్షన్స్ చేసుకోని గుర్రంగూడకు వచ్చారు. అయితే తనను ఆ ప్రదేశంలో రోడ్డుపై అడ్డగించి అతని వద్ద ఉన్న ఎనిమిదిన్నర లక్షల రూపాయల  బ్యాగ్ ను గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్ళినట్టుగా అయన ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ దైన శైలిలో విచారణా చేసేసరికి నిజం ఒప్పుకున్నాడు. అతడు పొదల్లో దాచిన డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.