మాయ‌ల ఫ‌కీర్‌లా బీజేపీ మాట‌లు

మాయ‌ల ఫ‌కీర్‌లా బీజేపీ మాట‌లు

తెలంగాణ బీజేపీ నేతల మాటలు మాయల పకీర్ లా ఉన్నాయని అన్నారు మంత్రి జోగు రామ‌న్న. ప్రజా క్షేత్రంలో బీజేపీ ప‌రాభ‌వం త‌ప్పదని ఆయన తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...బీజేపీ మునిగిపోయే పడవ అని వెల్లడించారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీని ప్రజలు బండకేసి ఉతకడం ఖాయమని అన్నారు. బీజేపీ నేత‌లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారని...టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయమని ఆయన వివరించారు. ఈసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని... అందుకు బీజేపీ నేత లక్ష్మణ్ సిద్ధమా.? అంటూ జోగు రామన్న సవాల్ విసిరారు.