దశలవారిగా రసాయన పరిశ్రమల తొలగింపు...

దశలవారిగా రసాయన పరిశ్రమల తొలగింపు...

హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రసాయన పరిశ్రమలను దశల వారీగా తొలగిస్తామని ప్రకటించారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్... హైటెక్ సిటీ వాసులకు సరికొత్త హంగులతో ఎకో టూరిజం పార్క్ అందుబాటులోకి వచ్చింది... కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లో 12 ఎకరాల్లో సహజసిద్ధంగా ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి... ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యావరణాన్ని కపడుకోకపోతే భవిష్యత్తు అందకరమే అవుతుందన్నారు. నగరీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసుకోవడానికి దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితులే నిదర్శనమని హెచ్చరించారు. ప్రజల భాగస్వామ్యం తోనే మొక్కల పెంపకం విజయవంతం అవుతుందని స్పష్టం చేసిన కేటీఆర్... హైదరాబాద్ లో ఉన్న 150 చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగరంలో వెలువడే మురికి నీరును శుద్ధి చేసే చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి... కబ్జాకు గురైన చెరువులు, అటవీ భూముల రక్షణకు కఠిన చట్టాలు రూపొందిస్తున్నామన్నారు.