నేతన్నకు చేయూత...

నేతన్నకు చేయూత...

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట చేనేత కార్మికుల సమస్యలపై సచివాలయంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు... ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట దుబ్బాక నేతన్నల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా సిద్దిపేట గొల్లభామ చీరకు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూంలో వీటిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోందన్న వెల్లడించిన మంత్రులు... నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, మగ్గాల ఆధునికీకరణ వంటి కార్యక్రమాలను నేతన్నల దగ్గరకు తీసుకెళ్లేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలు పరిశీలించారు మంత్రులు.