మిథాలీ రాజ్ అరుదైన రికార్డు
అంతర్జాతీయ మహిళల క్రికెట్లో భారత క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డు నెలకొల్పింది. అత్యధిక వన్డేలకు సారథ్య బాధ్యతలు చేపట్టిన క్రీడాకారిణీగా మిథాలీ రాజ్ రికార్డుల్లోకి ఎక్కింది. కెరీర్ లో 195 వన్డేలు ఆడిన మిథాలీ రాజ్.. 118 వన్డేలకు నాయకత్వం వహించింది. ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో నాయకత్వం వహించడంతో.. అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లకు నాయకత్వం వహించిన క్రీడాకారిణీగా మిథాలీ రాజ్ అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది.
ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారిణి చార్లెట్ ఎడ్వర్ట్స్ (117) తో రెండవ స్థానంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి బెలిందా క్లార్క్ (101) తో మూడవ స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ 76 వన్డేలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 2004లో మిథాలీ రాజ్ టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)