బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలి... 

బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలి... 

బీసీ రిజర్వేషన్ల విషయంపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయాలని... లేకుండా మరో పోరాటానికి సిద్ధమౌతామన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. సీఎం కేసీఆర్ ఇందుకు చొరవ చూపాలని.. వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి... సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లపై తమ వైఖరిని స్పష్టం చేయాలని వెల్లడించారు. ఈ విడత జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ చేసేలా సిఎం ప్రయత్నించాలని కోరారు. పోరాడి తెచ్చుకున్న రిజర్వేషన్లను ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆయన తెలిపారు. అధికారంలో బీసీలకు వాటా దక్కకుండా.... పాలకులు అడ్డుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు. వెంటనే ఈ అంశంపై తాత్కాలిక, శాశ్వత పరిష్కార మార్గాలను ప్రభుత్వం చూడాలని కోరారు. రాజకీయాల్లో రిజర్వేషన్లపై సీలింగ్ పెట్టడంలో  అర్ధం లేదని ఆయన వివరించారు. బీసీ సంఘంగా తాము సుప్రీమ్ కోర్టుకు వెళ్తామని.. బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆర్ కృష్ణయ్య వివరించారు.