తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త... ఈనెల 27 నుంచి... 

తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త... ఈనెల 27 నుంచి... 

తెలుగు రాష్ట్రాల్లో ఎండ మండిపోతున్నది.  రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నది.  ఎండలతో పాటుగా వడగాలులు కూడా తీవ్రంగా వేస్తున్నాయి.  ఒకవైపు కరోనా ఇబ్బందులు పెడుతుంటే మరోవైపు ప్రచండ భానుడి తీవ్రత ఎక్కువైంది.  లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా చాలామంది బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు.  బయటకు వెళ్తే ఎక్కడ వడదెబ్బ తగులుతుందో అని భయపడుతున్నారు.  

ఈ ఎండలు మరో మూడు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నది.  మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలియజేసింది.  అయితే, మే 27 వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ తెలిపింది.   తమిళనాడు, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది.  వాతావరణంలో తేమ తగ్గిపోవడంతో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని అంటున్నారు.  కాబట్టి ఈ రెండు మూడు రోజులపాటు ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని అంటున్నారు అధికారులు.