రోడ్డెక్కుతున్న వాళ్ల నుదుట పోలీసుల మార్కింగ్‌...

రోడ్డెక్కుతున్న వాళ్ల నుదుట పోలీసుల మార్కింగ్‌...


ఎక్కడికక్కడ కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో... దానిని కట్టడి చేయడానికి కఠినంగా  వ్యవహరిస్తున్నారు మధ్యప్రదేశ్‌ పోలీసులు. ఇంటి పట్టునే ఉండాలంటూ పదే పదే చెప్పినా వినకుండా రోడ్డెక్కుతున్న వాళ్లకు ఏకంగా నుదుటపై మార్కింగ్‌ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ఛత్రపూర్లో వలస కూలీల కోసం క్యాంప్‌లు ఏర్పాటు చేసినా వాటి ఉండకుండా రోడ్లపైకి వస్తున్నారు. తమ ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్న వాళ్లను సులభంగా గుర్తించేందుకు పర్మినెంట్‌ మార్కర్‌తో వాళ్ల నుదుటపై రాస్తేస్తున్నారు పోలీసులు. అలా ఒక లేడీ ఎస్సై నుడుటున రాస్తున్న ఫోటో బయటకు రావడంతో ఆమె చర్యలు తీసుకున్నట్టు అధికారులు పేర్కొనారు.