ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ, కుల్దీప్

ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ, కుల్దీప్

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు మైదానంలో శ్రమిస్తున్నారు. గత మూడు రోజుల నుండి భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడులు నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ధోనీ, రాయుడులు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ సమక్షంలో ప్రాక్టీస్ చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ సాధన చేసాడు. పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేస్తుండగా.. ధావన్, జడేజా, రాహుల్ లు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. సిడ్నీ వేదికగా శనివారం ఉదయం మొదటి వన్డే జరగనుంది.