నిజాం మత రాజకీయాలకు ఆయనే నిదర్శనం

నిజాం మత రాజకీయాలకు ఆయనే నిదర్శనం

నిజాం మత రాజకీయాలకు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన నిదర్శనమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్‌ బహిష్కరణ వేటు వేయడంపై ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందించారు. స్వామి పరిపూర్ణానందను బహిష్కరించడం మానవ హక్కుల ఉల్లంఘన అని అన్నారు. ఇది యావత్‌ హిందూ సమాజంపై దాడి అని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.