పోలవరం కేవలం నాలుగేళ్లలో ఓ రూపుకు తెచ్చాం

పోలవరం కేవలం నాలుగేళ్లలో ఓ రూపుకు తెచ్చాం

పోలవరం ఓ చరిత్ర అని, ప్రాజెక్టులు కట్టాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీ.. కానీ పోలవరం కేవలం నాలుగేళ్లల్లో ఓ రూపుకు తెచ్చామని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. పోలవరం గ్యాలరీ వాక్ సందర్భంగా ఆయన ఎన్ టీవీతో మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబే శంకుస్థాపన చేసి, ఆయనే గ్యాలరీ వ్యాక్ చేయడం విశేషమని అన్నారు. అందరి సహకారంతోనే పోలవరం పనులు పరుగెడుతున్నాయని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న హామీలను తీసుకువచ్చే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని, వాటి కోసం కేంద్రంతో పోరాడతామని మంత్రి లోకేష్ అన్నారు. 

దేశ చరిత్రలో ఏ ప్రాజెక్టు పనులు ఈ స్థాయిలో జరగడం లేదు. జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. అది మాకు దక్కింది. కేంద్రం వేసే కొర్రీలన్నింటికీ సమాధానం చెబుతూనే ఉన్నాం. నిర్మాణం జాప్యం అయితే ప్రాజెక్టు ధరలు పెరుగుతాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలి. సీఎం చంద్రబాబు చెబితే జరిగి తీరాల్సిందే. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా 2019 నాటికి నీటిని అందించి తీరుతాం. కేంద్రం నుంచి సహాయం అందకున్నా.. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేస్తామని మంత్రి లోకేష్  స్పష్టం చేశారు.