తూర్పుగోదావరి జిల్లాలో వింత జంతువు...అంతా టెన్షన్ టెన్షన్

తూర్పుగోదావరి జిల్లాలో వింత జంతువు...అంతా టెన్షన్ టెన్షన్

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరులో ఓ వింత జంతువు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజూ రాత్రివేళల్లో పొలాల్లో సంచరిస్తున్న జంతువు పశువులను చంపేస్తోంది. ఇప్పటిదాకా ఇరవైకి పైగా పశువులు చనిపోయాయి. దీంతో రైతులు రాత్రుళ్లు నిద్రపోకుండా పొలాల దగ్గర కాపలా కాస్తున్నారు. అటవీశాఖ అధికారులు కూడా స్థానికంగా పర్యటిస్తూ వింతజంతువు ఆనవాళ్లు పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖాధికారులు గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు. శుక్రవారం రాత్రి టీకే విశ్వనాథంకు చెందిన దూడను చంపి తినేసినట్టు గుర్తించారు.  దూడలను రక్షించాలని పశుసంవర్ధకశాఖ ఏడీ అటవీశాఖాధికారులను రైతులు కోరారు. వింతజంతువును పట్టుకోవడానికి ప్రత్యేక బోను ఏర్పాటు చేయాలని సూచించారు. పెనికేరులో నాలుగు దూడలు, జొన్నాడలో ఒక దూడను ఆ జంతువు తినేసిందని ఏడీ పేర్కొన్నారు.