పోలవరంపై గడ్కరీ, చంద్రబాబు సమీక్ష...

పోలవరంపై గడ్కరీ, చంద్రబాబు సమీక్ష...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పరీశీలించిన కేంద్ర జలవనరుశాఖ మంత్రి నితిన్ గడ్కరీ... ఆ తర్వాత ప్రాజెక్టు సైట్‌లోనే ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు, పలువురు మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, జరుగుతున్న పనులపై అడిగితెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ఎదురవుతోన్న ఇబ్బందులను గడ్కరీకి వివరించారు అధికారులు. పెండింగ్ లో ఉన్న డీపీఆర్ 1, డీపీఆర్ 2 వివరాలు తెలుసుకున్నారు. అంచనా వ్యయం పెరగడంపై కాంట్రాక్టర్లను వివరణ కోరిన నితిన్ గడ్కరీ... ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి పెరిగిన అంచనా వ్యయం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.