కులం మాటెత్తితే కొడతా..!

కులం మాటెత్తితే కొడతా..!

ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారిని కొడతానని హెచ్చరించానని.. అందుకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నాగ్‌పూర్‌ ప్రాంతంలో ఎవరూ కులం గురించి మాట్లాడరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. పుణెలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలో కుల వివక్షను రూపుమాపాలని పిలుపునిచ్చారు.  కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎన్ని కులాలు ఉన్నాయో కూడా ఇప్పటి వరకు తనకు తెలియదన్నారు. పేదలకు సాయం చేయాలని.. అది దేవుడికి సేవ చేయడంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.