ఇక ఆన్‌లైన్‌లో గనులశాఖ అనుమతులు...

ఇక ఆన్‌లైన్‌లో గనులశాఖ అనుమతులు...

టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోంది... క్రమంగా అన్ని విభాగాలు టెక్నాలజీ వినియోగంలో ముందడుగు వేస్తున్నాయి. తాజాగా     గనులశాఖలో ఆన్‌లైన్‌లో అనుమతుల ప్రక్రియ పోర్టల్‌ను ప్రారంభించారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు... గనుల శాఖలో మరింత పారదర్శకత, వేగం కోసం టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీంతో అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు వెళ్తుందన్నారు. దరఖాస్తుల సమర్పణతోపాటు తుది అనుమతుల వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే ఉంటాయని స్పష్టం చేసిన ఐటీ మంత్రి... త్వరలో గనులశాఖ మరిన్ని టెక్నాలజీ అప్లికేషన్లు వాడుకోనుంది అని వెల్లడించారు. ఇంటిగ్రెటెడ్ మైనింగ్ సర్వీలియన్స్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా మైనింగ్ కార్యకలాలపాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. లీజుకు ఇచ్చిన  విస్తీర్ణాన్ని డిజిటలైజ్ చేసి దాన్ని జియో మ్యాపింగ్ చేయడం, డ్రోన్ల టెక్నాలజీ వినియోగిస్తామని... ఖనిజాలను రవాణా చేసే వాహనాలను రిజిస్ట్రర్ చేసుకుని పర్యవేక్షించడం, జీపీయస్, అర్ యప్ ఐడి ట్యాగింగ్ చేస్తామని ప్రకటించారు.