అది ఫేక్‌ న్యూస్... విమాన ప్రమాదంలో మేము చనిపోలేదు: పాక్ నటి

అది ఫేక్‌ న్యూస్... విమాన ప్రమాదంలో మేము చనిపోలేదు: పాక్ నటి

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 90 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 107 మంది చనిపోయారని తెలుస్తోంది. జనావాసాల మధ్య ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది.ఇదిలా ఉంటే  కుప్పకూలిన పీఐఏ విమానంలో తాను, తన భర్త మరణించినట్టు సాగిన ప్రచారం పై పాకిస్తాన్‌ నటి ఆయేజా ఖాన్‌ సీరియస్ అయ్యారు. ఆ విమానంలో తాము లేమని, అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. కాగా, 99 మంది ప్రయాణికులతో కుప్పకూలిన ఈ విమానంలో అయేజా, ఆమె భర్త డానిష్ తైమూర్ ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.దాంతో ఆమె సోషల్ మీడియాలోన్   ఒక పోస్ట్ పెట్టారు.  'దయచేసి సవ్యంగా వ్యవహరించండి..ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేయడం ఆపండని ఆమె కోరారు.