మా విజయం థాయ్ హీరోలకి అంకితం...

మా విజయం థాయ్ హీరోలకి అంకితం...

థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వైల్డ్ బోర్ సాకర్ టీమ్ కి చెందిన 13 మంది సభ్యులు సురక్షితంగా ప్రాణాలతో బయటికి రావడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది... వరదనీటితో నిండిన గుహల నుంచి కోచ్ సహా పిల్లలంతా ప్రాణాలతో బయట పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వారు బయటకు వచ్చేవరకు ఇదే చర్చ... మరోవైపు ఫిఫా సమరం కూడా ఉత్కంఠగా సాగుతోంది. బెల్జియంతో నిన్న రాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ 1-0 గోల్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి ఫైనల్‌ అడుగుపెట్టింది. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి కాగా... తన చిరస్మరణీయ విజయాన్ని థాయ్ హీరోలకి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించింది ఫ్రాన్స్ జట్టు. 18 రోజుల తరువాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే... 11 నుంచి 16 ఏళ్ళ వయస్సు మధ్య ఉన్న థాయ్ ఫుట్ బాల్ ఆటగాళ్లు జూన్ 23 న శిక్షణ తర్వాత వారి కోచ్‌తో సహా గుహలోకి వెళ్లి చిక్కుకున్నారు. వాళ్లను కాపాడేందుకు చేపట్టిన సుదీర్ఘ ఆపరేషన్ విజయవంతం కాగా... ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఫ్రాన్స్ 1-0 గోల్ తేడాతో విజయం సాధించిన అనంతరం... ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ పాల్ పొగ్బా ట్విటర్ వేదికగా ఈ చిరస్మరణీయ విజయాన్ని ఆ బాలురకు అంకితం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు... ఈ రోజు హీరోలకు ఈ విజయం అంకితం. వెల్‌డన్ బాయ్స్. మీరు చాలా ధైర్యంగా నిలబడ్డారు అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.