పేటీఎంలో విదేశీ కరెన్సీ...

పేటీఎంలో విదేశీ కరెన్సీ...

'పేటీఎం కరో...' అంటూ అందరి ప్రశంసలు అందుకున్న డిజిట‌ల్ వాలెట్‌... మరో ముందడుగు వేసి ఫారెక్స్ సేవలను ప్రారంభించింది. భారత్‌లోని పేటీఎం యూజర్లు ఏ దేశానికి చెందిన కరెన్సీని అయినా తన వాలెట్ ద్వారా ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది పేటీఎం. అయితే వినియోగదారులకు పేటీఎం ఫారెక్స్ కార్డు లేదా క్యాష్ ను అందిస్తోంది. ఇందుకు ముందుగా మొత్తం సొమ్ములో 2 శాతం చెల్లించి ఫారెక్స్ రేట్లను లాక్ చేసుకోవచ్చు. తర్వాత డెలివరీ సమయంలో మిగిలిన మొత్తాన్ని నెఫ్ట్ లేదా ఆర్‌టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ సేవ నుంచి పేటీఎం 20 దేశాలకు చెందిన కరెన్సీని అందిస్తోంది. పేటీఎం అందించే ఫారెక్ట్ కార్డును ఏ దేశంలో అయినా ఏటీఎంలో వినియోగించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. లేదంటే మర్చంట్ లావాదేవీలు జరిపే సందర్భంలో స్వైప్ చేయవచ్చు. ఈ సర్వీస్ నుంచి కస్టమర్లు ఏడాదికి 2.50 లక్షల డాలర్లను ఫారెక్స్ కార్డులోకి లోడ్ చేసుకోవచ్చు. ఇక 3 వేల డాలర్లను కరెన్సీ నోట్ల రూపంలో పొందే వీలు కలిపించింది పేటీఎం.