పాక్‌లో విమాన ప్రమాదం.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..

పాక్‌లో విమాన ప్రమాదం.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పాక్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్‌పోర్ట్‌కు 4 కిలోమీటర్ల దూరంలోని ఓ మోడల్‌ కాలనీ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు పాకిస్థాన్‌ ఎయిర్‌ పోర్టు అథారిటీ ప్రకటించింది.. లాహోర్‌ నుంచి కరాచీకి వెళ్తున్న ఏ-320 విమానంలో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుండగా.. నివాసాల మధ్య విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, పాకిస్థాన్‌ విమాన ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమన్న ఆయన.. ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోడీ..