బెంగాల్ కు వెయ్యి కోట్లు తక్షణ సాయం... దీదీపై మోడీ ప్రశంసలు... 

బెంగాల్ కు వెయ్యి కోట్లు తక్షణ సాయం... దీదీపై మోడీ ప్రశంసలు... 

అంఫన్ తుఫాన్ వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను అతలాకుతలం చేసింది.  బుధవారం సాయంత్రం వెస్ట్ బెంగాల్ లోని దీఘా, బంగ్లాదేశ్ లోని హతియా వద్ద తీరం దాటింది.  ఆ సమయంలో వచ్చిన తుఫాన్ ధాటికి వెస్ట్ బెంగాల్ అతలాకుతలం అయింది.  దీఘా జిల్లా, కోల్ కతా ప్రాంతాలు  తీవ్రంగా దెబ్బతిన్నాయి.  కాగా, ఈరోజు ప్రధాని మోడీ బెంగాల్ లో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను నిర్వహించారు.  పరిస్థితిని అంచనా వేశారు.  

తక్షణ సాయం కింద వెస్ట్ బెంగాల్ కు వెయ్యి కోట్లు మంజూరు చేశారు.  అలానే మృతి చెందిన వ్యక్తులకు రూ.2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు.  గాయాలైన వ్యక్తులకు కేంద్రం రూ. 50 వేల రూపాయల సహాయం అందిస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు.  మమత బెనర్జీ ప్రభుత్వం అంఫన్ తుఫాన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేసిన కృష్ణిని ప్రధాని మోడీ మెచ్చుకున్నారు.  ఇప్పటికే దేశం కరోనా దెబ్బకు విలవిలలాడిపోతుంది.  కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అంఫన్ వంటి పెను తుఫాన్ రావడం విచారకరం.