ఏ గ్రూపులో చూసినా అవే వీడియోలు.. వణికిపోతున్నారట..!

ఏ గ్రూపులో చూసినా అవే వీడియోలు.. వణికిపోతున్నారట..!

కరోనా వైరస్ ప్రపంచాన్నిగడగడా వణికిస్తోంది.. దీంతో భారత్ ఈ వైరస్ మరింత విస్తరించకుండా నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదట ఈ నెల 31 వ తేదీ వరకు.. కేసులు క్రమంగా పెరుగుతుండడంతో ఆ తర్వాత ఏప్రిల్ 15 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది కేంద్ర ప్రభుత్వం... ఇదే సమయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర నిర్ణయానికి ఓటు వేశాయి. ఇక, కరోనా విస్తరించకుండా అంతా ఇంటికే పరిమితం కావాలని హెచ్చరించినా పట్టించుకోకుండా కొంత మంది రోడెక్కుతున్నారు.. వైన్స్ లు కూడా బంద్ కావడంతో మరికొంత మంది అలా సిటీకి దూరంగా తాటి కల్లు కోసం, ఇంకా కొందరు యూత్ ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్.. ఇంకా కొన్ని ఆటల్లో మునిగి పోతున్నారు.. అయితే.. పోలీస్ లు మాత్రం ఎవరినీ వదలడం లేదు.. రోడ్ ఎక్కినవారికి లాఠీలతో కుళ్ల పొడుస్తున్నారు.. క్రికెట్ మైదానాలు, తాటి వనాలు తేడా లేకుండా... గాలించి మరి తాట తీస్తున్నారు. అంతే కాదు.. ఆ తందంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.. దీంతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ తేడా లేకుండా.. ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక వాట్సాప్ లో అయితే.. మొత్తం అవే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.. ఆ దృశ్యాలను చూసిన కొంత మంది.. ఇంటి నుంచి బయటకి వెళ్ళడానికి వణికి పోతున్నారట... ఇందులో.. కొన్ని వీడియోలు ఇంటిముందు ముచ్చట్లు పెట్టేవారిని, ఇంటి బయట ఆటలు ఆడవారిని కూడా బాదేస్తుండడంతో.. ఇంటి నుంచి బయటకి రావడానికే కొంత మంది వణికి పోతున్నామని చెబుతున్నారు కొంతమంది. మరో వైపు వీటిని పట్టించుకోకుండా రోడ్ ఎక్కి లాఠీదెబ్బలు తినేవారు కూడా లేకపోలేదు.