తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గా బీఎస్ ప్రసాద్

తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గా బీఎస్ ప్రసాద్

తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ జయసాయి ప్రకాశ్‌‌రెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌‌కుమార్‌ అనర్హత కేసు విషయంలో సరిగా వాదించలేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడంతో 4 నెలల క్రితం ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేశారు.  ప్రకాశ్‌రెడ్డి 2017 జులై 18 నుంచి అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక.. ప్రకాశ్‌రెడ్డి స్థానంలో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా జనగామకు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై కేసీఆర్‌ ఇవాళ సంతకం చేశారు.