''రాహుల్ ద్రావిడ్'' అంటే ఇష్టం అంటున్న బన్నీ హీరోయిన్...

''రాహుల్ ద్రావిడ్'' అంటే ఇష్టం అంటున్న బన్నీ హీరోయిన్...

తెలుగు లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరంటే ముందు వినిపించే పేరు పూజా హెగ్డే . ఈ మధు తెలుగులో తక్కువ కలం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది పూజ. ఈ ఏడాది సంక్రాంతి కి అల్లు అర్జున హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో బన్నీకి జంటగా నటించి సూపర్ హిట్ అందుకుంది అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ సెలబ్రెటీలు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ సమయం లో సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారిని అలరిస్తున్నారు. అయితే ఆ విధంగా లైవ్ చాట్ లో ఓ అభిమాని.. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? అని పూజాని అడిగారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానంగా ది వాల్ ''రాహుల్ ద్రావిడ్'' అంటే ఇష్టం అని చెప్పింది బన్నీ హీరోయిన్. అయితే ప్రస్తుత ఆటగాళ్లలో ధోని.. ఇంకా కేఎల్ రాహుల్ ఆటతీరు నచ్చుతుందని అని చెప్పుకొచ్చింది. తాను ఎక్కడ ఉన్న భారత్ మ్యాచ్ జరుగుతుంటే స్కోర్ తెలుసుకోవడానికైనా ప్రయత్నిస్తానని తెలిపింది. ఈ అమ్మడు ప్రస్తుతం అఖిల్ తో కల్సి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తుంది. అలాగే ప్రభాస్ తో కూడా నటిస్తుంది