విజయవాడలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియాలో...

 విజయవాడలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియాలో...

అధికారుల వేధింపులు తాళలేక విజయవాడలో ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేస్తూనే పురుగుల మందు తాగాడు. రాయనపాడుకు చెందిన రాజు కీ మెన్‌ గా పనిచేస్తున్నాడు. తనను అధికారులు వేధిస్తున్నారంటూ వాపోయాడు. పురుగుల మందు తాగిన వెంటనే రైల్వే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కీమ్యాన్ రాజు చనిపోయాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.